హాజరుకానున్న పలువురు ప్రముఖులు
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలోని అమరవీరుల చౌరస్తాలో తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను ఉద్యమకారుల ఆధ్వర్యంలో బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్య భవనంలో మలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల స్థూపం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్, తెలంగాణ మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, మోత్కు పల్లి నరసింహులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ నగేష్, మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య, మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, పిఎసిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, తెరాస రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి, సిపిఐంల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్దన్, సిపిఐ జిల్లా కార్యదర్శి యానాలా దామోదర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, కౌన్సిలర్స్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీల రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ ముఖ్య నాయకులు హాజరు కానున్నారని తెలిపారు.



