Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుథ్రిల్‌ చేసే ట్విస్టులు

థ్రిల్‌ చేసే ట్విస్టులు

- Advertisement -

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీని రవి కుమార్ సీరపు తెరకె క్కించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈనెల 21న విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ, ‘మా చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్‌కి మంచి ఆదరణ దక్కింది. గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. మా కంటెంట్‌కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమా చాలా స్టైలీష్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ అద్భు తంగా ఉన్నాయని అంతా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ కంటే సినిమా పది రెట్లు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ట్విస్ట్‌ల్ని ఎవ్వరూ గెస్ చేయలేరు. చివరి వరకు ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొం దించాం. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నికల్ టీం అంతా కూడా మాకు సహకరిం చారు. మాకు విడుదల విషయంలో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ వారు అద్భుతంగా సపోర్ట్ ఇస్తున్నారు. వారి సహకారంతోనే ఎక్కువ స్క్రీన్‌ లలో మూవీని రిలీజ్ చేయగల్గు తున్నాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -