Wednesday, August 19, 2026
E-PAPER
Homeబీజినెస్పొంచిఉన్న ఆహార సంక్షోభ ముప్పు!

పొంచిఉన్న ఆహార సంక్షోభ ముప్పు!

- Advertisement -

వచ్చే ఏడాది గడ్డుకాలమే ఎల్‌నినో, ఎరువుల కొరతతో భారత్‌పైనా తీవ్ర ప్రభావం
ఆహార ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరొచ్చు
న్యూఢిల్లీ:
ప్రపంచవ్యాప్తంగా ఆహార 
సంక్షోభం మరోసారి ముంచుకొచ్చే ప్రమాదం ఉందని అంత‌ర్జాతీయ సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎరువుల సరఫరాలో అంతరాయాలు, వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం కలిసి 2027లో ప్రపంచ ఆహార ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ముఖ్యంగా భారత్, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు ఈ పరిణామాలకు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపింది.
జెపి మోర్గాన్ అంచనా ప్రకారం.. 2026 తొలి అర్ధభాగంలో 2.8 శాతంగా ఉన్న ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం 2027 తొలి అర్ధభాగంలో దాదాపు 5 శాతానికి ఎగిసే అవకాశం ఉంది. ఎరువుల కొరత, పంట దిగుబడుల్లో తగ్గుదల, రవాణా అంతరాయాలు తదితర అంశాలు ఆహార సరఫరా వ్యవస్థపై ఒత్తిడిని పెంచవచ్చని విశ్లేషించింది.
ఎరువుల సరఫరాపై భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ యూరియా ఎగుమతుల్లో మధ్యప్రాచ్యం కీలక వాటాను కలిగి ఉంది. హర్మూజ్‌ జలసంధి చుట్టూ దీర్ఘకాలిక అంతరాయాలు ఏర్పడితే ఎరువుల సరఫరా, ధరలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడే అవకాశం ఉందని జెపి మోర్గాన్ విశ్లేషించింది.
పంట దిగుబడులకు దెబ్బ..
భారత్‌కు ప్రత్యేకంగా ఎల్‌నినో ప్రభావం ఆందోళన కలిగించే అంశంగా మారింది. భారత వ్యవసాయం ప్రధానంగా రుతుపవనాలపై ఆధారపడటంతో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు పంట దిగుబడులను దెబ్బతీసే అవకాశం ఉంది. మరోవైపు ఎరువుల ఉత్పత్తికి అవసరమైన కొన్ని ముడి పదార్థాల కోసం భారత్ దిగుమతులపై ఆధారపడుతున్నందున అంతర్జాతీయ ధరలు, రవాణా అంతరాయాలు దేశీయ వ్యవసాయ వ్యయాలను పెంచవచ్చని జెపి మోర్గాన్ పేర్కొంది.
ఆసియా, ఆఫ్రికాలో కరువు..
ఎల్‌నినో బలపడితే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కరువు పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల బిల‌య్యం, గోధుమలు, చక్కెర, కాఫీ, కోకో వంటి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో ఒడిదుడుకులు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం బలపడుతున్న ఎల్‌నినో 2026 చివర్లో మరింత తీవ్రంగా మారే అవకాశాలపై కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా పంటల ఉత్పత్తి వ్యయం, ఎరువుల ధరలు, రవాణా ఖర్చులు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ప్రభావం వినియోగదారులపై మరింత తీవ్రంగా పడే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -