- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించేలా కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని మండల కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎస్ ఐ ఆర్ పక్రియలో ఫారం 6 ఓటర్ల నమోదును చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్ స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, జావీద్ ఖాన్, నాగలింగం, సూది రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



