Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాన్ నగర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సాన్ నగర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సట్ల గంగా ప్రవీణ్, మండల మాజీ అధ్యక్షులు గున్నాల వెంకటేశ్ గౌడ్, డి సి సి డెలిగేట్ కపిల్ కుమార్, మండల బిసి సెల్ అధ్యక్షులు గంగ మల్లు, గ్రామ శాఖ అధ్యక్షులు కనికరపు గంగాధర్, మండల ఉపాధ్యక్షులు జక్కా రాజలింగం, సీనియర్ నాయకులు చిలువేరులక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి, అక్బర్, పుట్టపర్తి పురుషోత్తం, షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -