Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్‌ మండల నాయకులకు సన్మానం

కాంగ్రెస్‌ మండల నాయకులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్‌
కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, వారి కలను సాకారం చేస్తోందని కాంగ్రెస్‌ మండలాధ్యక్ష‍ులు ధరాస్‌ సాయిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్న షక్కర్గా గ్రామంలో ఆయన ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ ప్రవేశాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ లబ్దిదారులు ధరాస్‌ సాయిలు, రామ్‌ పటేల్‌ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాండురంగ పాటిల్, గ్రామ కార్యదర్శి ప్రణయ్, ఆ గ్రామ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -