- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రమైన మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్ఎల్ హెచ్ పి బస్వరాజ్, కాలనీ ప్రజలకు పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు పలు సూచనలు చేశారు. వర్షాకాల సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కలుషితమైన నీరు త్రాగకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఈశ్వరీ, మంజూల, రేఖ, పాల్గొన్నారు.
- Advertisement -



