Saturday, August 22, 2026
E-PAPER
Homeజిల్లాలుఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్
నవతెలంగాణ – సంగారెడ్డి

జిల్లాలోని బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించేందుకు అర్హులైన మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్దిదారులు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

దరఖాస్తుదారుల వయస్సు 18 నిండి 55 సంవత్సరాల లోపు ఉండాలని, నిరుద్యోగ మహిళలు, నిరుపేదలు, నిరాధారణకు గురైన వితంతు, ఒంటరి, వికలాంగులు, అనాధ మహిళలకు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. నివాసం, కులం, ఆదాయం, ఆధార్, విద్యార్హత, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలు, తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, కనీస అక్షరాస్యత తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎక్కువ దరఖాస్తులు వస్తే కనీస విద్యార్హత ఐదవ తరగతి పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణ వాసులకు రూ.2 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు అప్లికేషన్‌ లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన పత్రాలను గ్రామీణులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతవాసులు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -