Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డైరీ అండ్ పౌల్ట్రీ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

డైరీ అండ్ పౌల్ట్రీ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
బల్మూరు మండలం కొండనాగుల ఉమా మహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డైరీ అండ్ పౌల్ట్రీ సబ్జెక్టు బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టు మంజూరైందని కళాశాల ప్రిన్సిపాల్ పరంగి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరీ అండ్ పౌల్ట్రీ సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులైన వారు లేదా ఎం.ఎస్‌సీ జువాలజీ పూర్తి చేసి కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. SC/ST అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే అర్హతగా పరిగణిస్తారని పేర్కొన్నారు. NET, SET లేదా Ph.D. అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23, 2026 సాయంత్రం 3:00 గంటలలోపు ధరఖాస్తులను కళాశాలలో అందజేయాలనీ తెలిపారు.దరఖాస్తు చేసుకొని వారు నేరుగా ఆగస్టు 24, 2026న నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు ప్రిన్సిపాల్ పరంగి రవి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -