Saturday, August 22, 2026
E-PAPER
Homeమానవిఒత్తిడిని జయించాలంటే...

ఒత్తిడిని జయించాలంటే…

- Advertisement -

మారుతోన్న జీవన విధానం, పని వేళల్లో మార్పులు, మారిన వర్క్‌ కల్చర్‌ కారణం ఏదైనా… ఒత్తిడితో ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ టెన్షన్‌తో కూడిన జీవితంవల్ల చాలా మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

 ఎక్కువ సేపు పని చేసి తర్వాత ఏర్పడే ఒత్తిడిని తగ్గించుకోవడంలో ధ్యానం బాగా పనిచేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం, ఏకాంత ప్రదేశంలో కూర్చుని, కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతీ రోజూ చేస్తే మార్పు మీరే స్పష్టంగా గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు.
 సంగీతం వినడం వల్ల మాననసిక స్థితితో పాటు భావోద్వేగాలను చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఇది మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజులో కొంత సేపు సంగీతం వింటే ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. అనేక పరిశోధనలు కూడా సంగీతం శక్తివంతంగా మూడ్‌లను స్వింగ్ చేయగలదని నిరూపించాయి.
 నవల లేదా ఏదైనా పుస్తకాన్ని చదవడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొద్ది సేపు పుస్తకం చదవడం వల్ల మనస్సు టెన్షన్, ఒత్తిడి లేకుండా ఉంటుంది. మనస్సును రిలాక్స్‌గా ఉంచడానికి చదవడం సులభమైన మార్గం.
 మానసిక ఒత్తిడిని తగ్గించడంలో శారీరక వ్యాయామం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ వాకింగ్, యోగా, రన్నింగ్‌ వంటి వాటితో మనసు ప్రశాంతంగా మారుతుంది.
 ఇక పనిలో ఎంత బిజీగా ఉన్నాన్నా ప్రతీ రోజూ కొద్ది సేపైనా మీకు కావాల్సిన వారితో మాట్లాడాలని చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి బలదూర్‌ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -