Saturday, August 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

- Advertisement -

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌ను సందర్శన


నవతెలంగాణ-ఆర్మూర్

ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ, నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‌పొంగులేటి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సొంత గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులను వేగవంతం చేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు రాని లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తెచ్చారు. ఆలూర్ తహసీల్దార్ కార్యాలయ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నగేష్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -