పరిమితి దాటితే
కొత్త కనెక్షన్ నిరాకరణ
న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఒక వ్యక్తి పేరుపై ఇప్పటికే నిర్ణయించిన గరిష్ఠ సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఉంటే, ఇకపై కొత్త సిమ్ కేటాయించరాదని టెలికాం సంస్థలను టెలికమ్యూని కేషన్ల శాఖ ఆదేశించింది. ఆగస్టు 17న జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణ వినియోగదా రులు గరిష్ఠంగా 9 సిమ్ కనెక్షన్లు మాత్రమే కలిగి ఉండవచ్చు. ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం, జమ్మూ-కశ్మీర్ ప్రాంతాల్లో ఈ పరిమితి 6 కనెక్షన్లుగా ఉంది. అన్ని టెలికాం సంస్థలు, సర్కిళ్లలోని కనెక్షన్లను కలిపి ఈ పరిమితిని వర్తింపజేస్తారు. కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఇతర సంస్థల వద్ద ఉన్న తమ నంబర్ల వివరాలను కూడా వెల్లడించడం తప్పనిసరి.పరిమితికి మించి సిమ్ కార్డులు ఉన్నవారిని గుర్తించేందుకు ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ వేదికను టెలికాం సంస్థలు ఉపయోగించనున్నాయి. ఆగస్టు 23 నుంచి పరిమితిని చేరుకున్న ప్రతి వినియోగదారుడి ఫొటో ఆధారిత సమాచారాన్ని కూడా ఈ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నారు. నవంబరు 30 నాటికి ఈ వ్యవస్థను సిమ్ నమోదు ప్రక్రియతో పూర్తిగా అనుసంధానించాలని ఆదేశించారు. నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత పొరపాటున పరిమితికి మించి కొత్త కనెక్షన్ జారీ అయితే, సమస్య పరిష్కారమయ్యే వరకు ఒక రోజులోనే ఆ కనెక్షన్‌ను నిలిపివేయాల్సి ఉంటుంది. మొబైల్ నెట్‌వర్క్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడం, మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
సిమ్ కార్డులపై కేంద్రం కఠిన ఆంక్షలు
- Advertisement -
- Advertisement -



