నవతెలంగాణ-హైదరాబాద్ : గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. భవనం శిథిలాల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మరొకరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరికొందరు వర్కర్లు, స్థానికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. భారీ భవనం కావడంతో.. శిథిలాలను తొలగించేందుకు సమయం పడుతుందని, రెస్క్యూ పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులను మధ్యప్రదేశ్ కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42)లుగా గుర్తించారు. వీరు టైల్స్ పనిచేస్తూ.. కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. భవన యజమాని నాలాను ఆనుకుని భవనం నిర్మించడం ఒక్క తప్పయితే.. 50 గజాల భూమిలో ఏడంస్తుల నిర్మాణం చేపట్టడం మరో తప్పిదంగా గుర్తించారు. అసలు అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారా ? లేదా ఇష్టానుసారంగా నిర్మించారా? అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
గచ్చిబౌలిలో కూలిన భవనం..ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



