నవతెలంగాణ – నర్సింహులపేట
ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శక కోసం డిజిటల్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరమవుతుందని తహశీల్దార్ రమేష్ బాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దనాగారం స్టేజీ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ భూక్య సోనియా హరిలాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవిబాబు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు, నాయకులు హరిలాల్, నరేష్ నాయక్, అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



