జిల్లా కలెక్టర్ కు నివేదికలు అందిస్తామని జడ్పీ సిఈఓ నాగవర్ధన్
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని నిగ్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి సింధుజపై అధికారులు శనివారం కుభీర్ మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. గత ఆరు నెలల క్రితం గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించి, ఇద్దరు లబ్దిదారుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపనుల ఆధారంగా పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై మరోసారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ సీఈఓ నాగవర్ధన్ విచారణ చేపట్టారు. ఈ విచారణ అనంతరం నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ భీమేష్, జెడ్పి సీనియర్ అసిస్టెంట్ షహీద్, తదితరులున్నారు.
నిగ్వ కార్యదర్శి అవినీతిపై విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



