నవతెలంగాణ-బాల్కొండ
రోడ్డు ప్రమాదంలో (గుర్తు తెలియని) వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాల్కొండ ఎస్ ఐ శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే 44 పై చిట్టాపూర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్లే దారిలో శనివారం తెల్లవారుజామున హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఆమె వయసు సుమారు 55 నుంచి 65 సంవత్సరాల వరకు ఉంటుందని, శరీరంపై పసుపు రంగు జాకెట్ ఆకుపచ్చ రంగు చీర ఉందని తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, అలాగే బాల్కొండ పోలీస్ స్టేషన్ 8712659756, ఎస్ హెచ్ ఓ బాల్కొండ 8712659860 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ శైలేందర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



