- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పరకాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి పట్టుబడిన వాహనాలను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ పి. తాతాజీ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, వరంగల్ రూరల్ వారి ఆదేశాల మేరకు పరకాల ఎక్సైజ్ స్టేషన్లో ఈ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆయా వాహనాల అప్సెట్ ధరలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వాహనాల వేలానికి ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి పరకాల ఎక్సైజ్ స్టేషన్‌కు హాజరుకావాలని సీఐ తాతాజీ సూచించారు.
- Advertisement -



