Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈకేవైసీ అయితేనే వంటగ్యాస్.!

ఈకేవైసీ అయితేనే వంటగ్యాస్.!

- Advertisement -

లేకుంటే కమర్షియల్ సిలిండర్ ధర చెల్లించాల్సిందే
నవతెలంగాణ – మల్హర్ రావు

నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ) ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట. ప్రసార మాధ్యమాల్లో ప్రకటనల్లా ఇప్పుడేం నడుస్తుందంటే ఈకేవైసీ నడుస్తుందని చెప్పక తప్పదు. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియ సాగుతుండగా మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. ఇక ఇంటి అవసరాలకు ముఖ్యమైన గ్యాస్ కు ఈకేవైసీ తప్పనిసరి. గత ఏడాది కాలంగా ఈ ప్రక్రియ జరుగుతుండగా ఈ నెల 23తో గడువు ముగియగా 31 వరకు పొడిగించారు. తాజాగా గడువు పొడిగించనుండగా వీలైనంత త్వరగా కేవైసీ చేసుకోవాని గ్యాస్ ఏజెన్సీలు విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే గడువులోపు కేవైసీ చేసుకోవడం ఉత్తమం. లేకుంటే ప్రస్తుతం చెల్లిస్తున్న సిలిండర్ ధర రూ.1013 కాకుండా కమర్షియల్ సిలిండర్ ధర రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా గ్యాస్ కనెక్షన్ సస్పెండ్ చేసే అవకాశముందని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా చమురు కంపనీలు ఫోన్లోనే ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. ఇంకెందుకు ఆలస్యం.. అర చేతిలోనే కేవైసీ చేసుకోండి.

ఇండెన్ అయితే
ప్లే స్టోర్ నుంచి ఇండియన్ ఆయిల్ వన్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి లింక్ అయిన ఫోన్ నంబరు లేదా మెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి. మొదటిసారి ఉపయోగిస్తే సైన్ అప్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. మీ గ్యాస్ క్యాష్ మెమో లేదా సబ్ స్క్రిప్షన్ వొచర్లో ఉండే 16 అంకెల ఎల్పీజీ ఐడీని లింక్ చేయాలి. అప్పుడు కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అండ్ ఈ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ మార్క్ ఉంటే మీ కేవైసీ పూర్తి అయినట్లే. కాకపోతే అక్కడే రి-అథంటికేట్ బటన్ నొక్కి మీ ముఖాన్ని స్కాన్ చేసి బయో మెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే ముందు అన్ లాక్ చేయాలి.

భారత్ గ్యాస్ అయితే
ప్లే స్టోర్ నుంచి హెలో బీపీసీఎల్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్ మొబైల్ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ అవ్వాలి. యాప్ హోమ్ పేజీలోనే ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మరోసారి ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. అనంతరం ప్రాసెసు సూచనలు చేస్తుంది. దాన్ని అనుసరిస్తూ పూర్తి చేసుకోవాలి.

హెచ్పీ అయితే
ప్లే స్టోర్ నుంచి హెచ్ పీ పేతో పాటు, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్పై క్లిక్ చేసి మీ గ్యాస్ అకౌంట్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి, ఓటీపీతో వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం హోమ్ పేజీలో మై హెచ్ పీ సెక్షన్ లోకి వెళ్లి ఎల్పీజీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సూచనలు పాటించాలి. అనంతరం కాప్చర్ ఫేస్పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. తర్వాత ముఖం స్కాన్ చేస్తే పూర్తవుతుంది.

కేవైసీ చేసుకోకుంటే గ్యాస్ కష్టమే: కుక్కడపు వెంకటేశ్వర్లు, శుశ్రీత ఇండియన్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులు
ప్రతీ వంట గ్యాస్ కనెక్షన్ దారు ఈకేవైసీ చేసుకోవాలసిందే. సమీప గ్యాస్ ఏజెన్సీలో చేసుకోవచ్చు లేదా ఫోన్లో ఉన్న యాప్ ల ద్వారా చేసుకోవచ్చు.ఒ క వేళ కేవైసీ చేసుకోకుంటే కమర్షియల్ గ్యాస్ ధర చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. కనెక్షన్ కూడా సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి. తాడిచెర్ల శుశ్రీత ఇండియన్ గ్యాస్ ఏజన్సీలో మొత్తం 5,974 కనెక్షన్లు ఉండగా ఇప్పటికే 97.5 శాతం ఈకెవైసి పూర్తయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -