Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్య బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత

అనారోగ్య బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన పావిరాల సుగుణ గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో మెరుగైన చికిత్సకై ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఇటీవల రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకుపోయారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు సీఎంఆర్ఏఫ్‌ ద్వారా వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. సోమవారం మంత్రి ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం బాధితురాలు కుటుంబ సభ్యులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -