Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పద్మాజివాడిలో ఉచిత వైద్య శిబిరం 

పద్మాజివాడిలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ-సదాశివనగర్ 
మండలంలోని పద్మాజివాడి గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్ లోకోటి సుబ్బారావు తెలిపారు. ఈ శిబిరాన్ని హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా బిపి, షుగర్ పరీక్షలు చేసి, మోకాళ్ల నొప్పులు మధుమేయం, నరాల బలహీనత దగ్గు, దమ్ము గ్యాస్ ట్రబుల్ అల్సర్ గొంతు నొప్పి జ్వరం లాంటివారికి మందులు పంపిణీ చేశారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఒకరోజు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించి, ట్రీట్మెంట్, టెస్టులు స్కానింగ్లు, ఆపరేషన్లు, ఉచితంగా భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రక్త మూత్ర ,పరీక్షలు ఎక్స్రే రే  పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారుగా 263 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. వీరిలో 25 మందిని హైదరాబాద్ హాస్పిటల్ కు రెఫర్ చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -