మల్లు రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై చర్యలుంటాయని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ మల్లు రవి తెలిపారు. మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ ముఖ్యమని, క్రమశిక్షణతో పార్టీకి గౌరవం వస్తుందనీ, ఆ గౌరవంతోనే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. పార్టీపై వ్యతిరేక అభిప్రాయం రాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేని ఆయన అభిప్రాయపడ్డారు. తమ నివేదికను టీపీసీసీ అధ్యక్షునికి సమర్పించామనీ, అందులో కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన పూర్తి అంశాలున్నాయని తెలిపారు. ఆ నివేదికను అధ్యక్షులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి పంపిస్తారని తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసి ఒక అంచనాకు వచ్చామనీ, గత విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. వారిపై నిర్ణయంతో నాయకులు, క్యాడర్ కు ఒక సందేశం ఇవ్వాలని భావించినట్టు తెలిపారు.
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



