- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



