Wednesday, August 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగోదావరికి పోటెత్తుతున్న వరద..

గోదావరికి పోటెత్తుతున్న వరద..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గత రెండు, మూడు రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాలలో పడుతున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తుతుంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రతరమైంది. ప్రాజెక్టు పరిధిలోని ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్ వే వద్ద నీటిమట్టం 30.20 మీటర్లుగా నమోదైంది. వరద నీటిని క్రమబద్ధీకరించేందుకు అధికారులు స్పిల్ వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి, దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -