నవతెలంగాణ – ఆర్మూర్
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై రేపు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఎన్ జిఓఎస్ యూనిటీ అధ్యక్షులు కే శశికాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. పదివేల కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రెండవ పి ఆర్ సి ని ప్రకటించాలని, ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం విధి విధానాలు అమలు చేసి తక్షణమే ఆరోగ్య సేవలు ప్రారంభించాలని, 64 అంశాలతో కూడిన ఉద్యోగుల డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ధర్నాను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



