- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఓ వ్యక్తి నోట్లో సుమారు 82 గ్రాముల బంగారాన్ని దాచి ఎయిర్‌పోర్టులో అధికారులకు దొరికిపోయాడు. సిరాజ్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఈరోజు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి గజియాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స్క్రీనింగ్ వద్ద అతడు సరిగ్గా స్పందించక పోవడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. దీంతో అతడి నోట్లో రెండు బంగారం క్యాప్యూల్స్ బయటపడ్డాయి.
- Advertisement -



