Thursday, August 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిహక్కులపై ఉక్కుపాదం

హక్కులపై ఉక్కుపాదం

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్న కార్మికులపై అణిచివేత పెరిగిందని గ్లోబల్ రైట్స్ ఇండెక్స్ (ప్రపంచ హక్కుల సూచిక) తెలిపింది. ప్రభుత్వాలు కార్మికుల హక్కులను రక్షించడంలో విఫలమవుతున్నాయని, పైగా చాలాచోట్ల వారిని అణిచివేస్తున్నాయని 2026 ప్రపంచ హక్కుల సూచిక చెప్తోంది. అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫడరేషన్ ప్రతి యేటా ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కుల ఉల్లం ఘనలను వివరిస్తుంది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా కార్మికుల హక్కుల మరింత దిగజారాయని ఈ నివేదిక తెలిపింది. ఆందోళన కలిగించే అంశాలు ఏమిటంటే? 72శాతం దేశాల్లో కార్మికులకు న్యాయం దొరకడం లేదు. సగం దేశాల్లో యూనియన్ హక్కుల కోసం పోరాడినందుకు కార్మికులను అరెస్టు చేస్తున్నారు లేదా జైల్లో పెడుతున్నారు. అన్ని దేశాల్లో కార్మికుల మాట్లాడే హక్కు, కలిసి సమావేశ మయ్యే హక్కుపై దాడులు జరుగుతున్నాయి. కార్మికులపై హింస 6శాతం పెరిగి, 32శాతం దేశాలకు చేరింది.

కార్మిక సంఘ నాయకులను అరెస్టు చేయడం, వేధించడం, చంపడం వంటివి పెరి గాయి. కార్మికుల హక్కులు, స్వేచ్ఛల విషయంలో అత్యంత అధ్వాన్నమైన పది దేశాల్లో బెలారస్, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్వాటిని, మయన్మార్, నైజీరియా, ట్యునీ షియా, టర్కీ ఉన్నాయి. ఈ జాబితాలోకి కొత్తగా అర్జెంటీనా, పనామా కూడా చేరాయి. అమెరికా, గినియా-బిస్సావు, ఇజ్రాయెల్, లైబీరియా, ఫిలిప్పీన్స్, మోల్డోవా, జింబాబ్వే దేశాలను ‘‘వాచ్ లిస్ట్’’లో పెట్టారు. యూరప్, అమెరికా ఖండాల్లో కూడా పరిస్థితి బాగా దిగజారింది. 2014లో ఈ సూచిక మొదలైనప్పటి నుండి ఈ ఏడాది స్కోర్లు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఇది ప్రపంచంలో ప్రజాస్వామ్యం, కార్మిక హక్కులు దెబ్బతింటున్నాయని చూపిస్తోంది. ఉపాధ్యాయ సంఘాలపై జరుగుతున్న దాడుల గురించి కూడా ఈ నివేదిక చెప్పింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు కేవలం మంచి విద్య, గౌరవం కోసం పోరాడుతున్నందుకు వారి గొంతు నొక్కుతున్నారు, అరెస్టు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు.

ఇరాన్ నుండి యెమెన్ వరకు, నేపాల్ నుండి ఎస్వాటిని వరకు ఉపా ధ్యాయులపై కావాలనే దాడులు జరుగుతున్నాయి. ఉపాధ్యాయుల హక్కులు దెబ్బతింటే, అది విద్య హక్కుపై దాడి చేసినట్లే’’ అని ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్పందించింది .ఎస్వాటినిలో స్వాజి లాండ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ (ఎస్‌ఎన్‌ఎటి)పై ప్రభుత్వం నిరంతరం వేధింపులకు పాల్పడుతోంది. ఆ సంఘ అధ్యక్షుడు మ్బోంగ్వా డ్లామినిని ఉద్యోగం నుంచి తీసేశారు. ప్రధాన కార్యదర్శి లాట్ విలకాటిని అరెస్టు చేసి పోలీసులు తీవ్రంగా కొట్టారు. పనామాలో ఎంపియు అనే ఉపాధ్యాయ సంఘం మంచి పింఛను కోసం సమ్మె చేసింది. చర్చలు జరపకుండా ప్రభుత్వం వారిని కొట్టింది, అరెస్టు చేసింది, జీతాలు ఆపేసింది. ఉపాధ్యాయులతో పాటు నిరసనలో పాల్గొన్న అరటి కార్మికులు, గిరిజనులను కూడా వేధించింది.

ఇరాన్‌లో చాలా ఏళ్లుగా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘం నాయకులను(సిసిఐటిటిఎ)లక్ష్యంగా చేసుకుం టోంది. కేవలం తమ హక్కుల కోసం మాట్లాడినందుకు వారిని వేధిస్తోంది, అరెస్టు చేస్తోంది, జైల్లో పెడుతోంది. ఐటియుసి ప్రతినిధి మాట్లాడుతూ -‘‘కార్మికుల హక్కుల సమస్య ఇప్పుడు చిన్న విషయం కాదు, అది ప్రజాస్వామ్యా నికే ప్రమాదంగా మారింది. కానీ కార్మికులు, వారి సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. కార్మికుల హక్కుల కోసం పోరాటమే ప్రజాస్వామ్యం కోసం పోరాటం. బలమైన సంఘాలు లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు’’ అన్నారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య సమాజాలకు విద్య ఒక మూల స్తంభం అనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ‘‘ఉపాధ్యాయులను మాట్లాడ నివ్వకుండా, జైల్లో పెడుతూ మీరు ప్రజాస్వామ్యాన్ని నిర్మించలేరు. దాడులకు గురవుతున్న ప్రతి ఉపాధ్యాయుడికి మేము అండగా ఉంటాం. మేము భయపడము. సంఘటితమై, గొంతు విప్పి, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం. ప్రభుత్వాలు ఉపాధ్యాయ సంఘాలను గౌరవించాలి’’ అని ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు అన్నారు. “ప్రభుత్వాలు కార్మిక సంఘాల హక్కులను గౌరవించి, సమర్థించాలని, నాణ్యమైన విద్యకు, మరింత న్యాయ మైన సమాజాలకు బలమైన, స్వతంత్ర ఉపాధ్యాయ సంఘాలు అత్యవసరం’’ అని గుర్తించాలని పిలుపునిచ్చింది.

ఈ నిరాశాజనకమైన నేపథ్యంలో, కొన్ని దేశాలు కార్మిక హక్కుల విషయంలో తమ రికార్డును మెరుగుపరుచుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఒక ఆశాకిరణాన్ని అందిం చాయి. ఇది ముఖ్యంగా ఉరుగ్వే విషయంలో నిజం. అక్కడ కొత్త అధ్యక్షుడు యమండూ ఓర్సీ -ఒక చరిత్ర ఉపాధ్యాయుడు మరియు ఫెనాపెస్ విద్యా సంఘం మాజీ సభ్యుడు – మరియు అతని ప్రభుత్వం, సమ్మె చేసే హక్కుతో సహా కార్మిక హక్కులను గౌరవించడానికి, అలాగే సామాజిక సంభాషణ, సంప్రదింపులకు ప్రాధాన్యత ఇవ్వడా నికి కట్టుబడి ఉన్నాయి. ఆగష్టు 2025లో, ఫెనాపెస్ ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది. ఇది గత ప్రభుత్వం నుంచి ట్రేడ్ యూనియన్లపై జరిగిన వేధింపులకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికింది.

-కె. వేణుగోపాల్,9866514577

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -