మంత్రి వాకిటి శ్రీహరికి సీఎం అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే అత్యున్నత పని తీరు కలిగిన క్రీడలకు ప్రముఖ సంస్థల్లో ఒకటైన కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ (కెఎన్ఎస్ యూ) తో ఎంఓయూ కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గతంలో తన దక్షిణ కొరియా పర్యటనలో కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్షులు మూన్ వోన్-జే తో సహా ఉన్నత ప్రతినిధి బృందాన్ని కలిశానని గుర్తు చేశారు. ప్రతిపాదిత యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, కెఎన్ ఎస్ యూమధ్య భాగస్వామ్యం కోసం తాము వివరంగా చర్చించినట్టు తెలిపారు. ఈ భాగస్వామ్యం ఇప్పుడు కేవలం ఒక ఎంఓయూ కంటే ఎక్కువ. ఇది తెలంగాణ క్రీడా ప్రతిభకు, అథ్లెట్ శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, హై-పెర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్ లో ప్రపంచ ఉత్తమ విధానాలకు మధ్య ఒక వారధి అని ఆయన పేర్కొన్నారు.
కెఎన్ఎస్ యూలో శిక్షణ పొందిన అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాలలో 16 పతకాలను అందించారు. అలాంటి శ్రేష్టమైన సంస్కృతిని తెలంగాణకు తీసుకురావాలని తాము కోరుకున్నట్టు ఆయన తెలిపారు. అలాంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి, మన యువ అథ్లెట్లు ప్రపంచ క్రీడా శ్రేష్టత నుంచి నేర్చుకునేందుకు కొత్త మార్గాలను తెరిచిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి, క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులకు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. దీంతో మన గ్రామాలు, పట్టణాల నుండి ఒలింపిక్ పోడియం వరకు తెలంగాణ ఈ ప్రయాణానికి సిద్ధమవుతోందని చెప్పారు. భారత్ 2036 ఒలింపిక్స్ వైపు చూస్తున్న తరుణంలో, తెలంగాణ సిద్ధంగా ఉండాలని నిశ్చయించుకుందని స్పష్టం చేశారు. కేవలం ప్రపంచంలోని గొప్ప క్రీడా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడానికి మాత్రమే కాదు, భారతదేశాన్ని గర్వపడేలా చేసే అథ్లెట్లను తయారు చేయడానికి కూడా నిశ్చయించుకున్నట్టు తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) లో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో ఏర్పాటు చేస్తారని సీఎం తెలిపారు.
కెఎన్ఎస్ యూతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంఓయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



