Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసుష్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు

సుష్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు

- Advertisement -


కాంగ్రెస్ సీనియర్ నేత, 
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుష్మితకు 38 సంవత్సరాలని, ఆమెకు 15 ఏండ్ల కూతురు, కుమారుడు ఉన్నారని వివరించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఆ అంశంపై ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ కమిటీకి చెప్పాల్సినదంతా చెప్పామని, వారు ఎం నిర్ణయం తీసుకుంటారో తమకు తెలియదన్నారు. తమకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళీ నొక్కి చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. డిప్యూటీ సీఎంను కలిసేందుకు వెళ్లగా, రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉన్నారని వివరించారు. మరోవైపు తాను కూడా ప్రత్యేకంగా ఈ విషయంపై రాలేదని, ఓ బిల్లు గురించి మాట్లాడేందుకు వచ్చినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -