Thursday, August 27, 2026
E-PAPER
Homeబీజినెస్పెట్‌ ఫుడ్‌ ‌మార్కెట్‌‌లోకి విప్రో

పెట్‌ ఫుడ్‌ ‌మార్కెట్‌‌లోకి విప్రో

- Advertisement -


స్నగిల్స్‌ పెట్‌ ఫుడ్‌ బ్రాండ్‌‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

వేగంగా విస్తరిస్తోన్న పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి కార్పోరేట్‌ దిగ్గజం విప్రో అడుగుపెట్టింది. రూ.5.500 కోట్ల మార్కెట్‌తో గణనీయంగా వృద్ది చెందుతున్న భారత పెట్‌ ఫుడ్‌ విపణీలో రానున్న ఐదేండ్లలో టాప్‌-3లో నిలువటమే లక్ష్యంగా ‘స్నగిల్స్‌’ బ్రాండ్‌ను విప్రో ఆవిష్కరించింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విప్రో ఫుడ్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ చుగ్‌ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. స్నగిల్స్‌ బ్రాండ్‌తో మూడు వేరియంట్లను విప్రో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఆల్‌ బ్రీడ్స్‌ పప్పీ, అడల్ట్‌ స్మాల్‌ బ్రీడ్‌, అడల్ట్‌ మీడియం, లార్జ్‌ బ్రీడ్‌ విభాగాల్లో స్నగిల్స్‌ పెట్ ఫుడ్‌ను అందించనుంది. హ్యూమన్‌ గ్రేడ్‌ ఇంగ్రీడియెంట్స్‌తో సరసమైన ధరలకు రుచికరమైన ఆహారం అందించనున్నారు. ఫ్రీజ్‌ డ్రైడ్‌ చికెన్‌ చంక్స్‌ స్నగిల్స్‌ ప్రత్యేకతగా నిలువనుందని విప్రో తెలిపింది. ‘భారత్‌లో పెట్‌ పేరెంటింగ్‌ ఎదుగుతోంది. ఈ విభాగంలో నాణ్యమైన, న్యూట్రిషనల్‌,నమ్మకమైన ఫుడ్‌ను అందించేందుకు అవకాశం ఉందని భావించాం. 18 నెలల ఎక్స్‌పైరీతో సరసమైన ధరల్లోనే పెట్‌ ఫుడ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. భారత్‌లోని ఎనిమిది తయారీ కేంద్రాల్లో స్నగిల్స్‌ తయారు చేస్తారని’ అనిల్‌ చుగ్‌ తెలిపారు. ‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -