Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న కథతో ‘భోగి’

భిన్న కథతో ‘భోగి’

- Advertisement -

శర్వా హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రాఖీ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ స్పెషల్ పోస్టర్‌లో శర్వా పల్లెటూరి కుర్రాడి అవతార్ లో కనిపించారు. పోస్టర్‌లో పల్లెటూరి వాతావరణం, ఆత్మీయమైన కుటుంబ అనుబంధాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. శర్వా తన తోబుట్టువులతో కలిసి కూర్చుని తాటికాయలను కొట్టి అందరికీ పంచుతూ కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. తోబుట్టువుల మధ్య ప్రేమ, అనుబంధంతో పాటు పల్లె జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను అందంగా డిజైన్ చేశారు. రాఖీ పండుగ స్ఫూర్తిని చూపించిన ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగుతుంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వే గాలు, భారీ యాక్షన్ ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -