Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల గంగా ప్రవీణ్ 
నవతెలంగాణ-బాల్కొండ

కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల గంగా ప్రవీణ్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ మండల నూతన కార్యవర్గంతో పాటు మండల పరిధిలోని 10 గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు.

కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల నూతన కార్యవర్గం 
కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా ఎం రవి గౌడ్ (బస్సాపూర్), ఈ. కృష్ణ (నాగపూర్), జనరల్ సెక్రెటరీలుగా పి విద్యాసాగర్ (బాల్కొండ), సిహెచ్ నాగేష్ (కిసాన్ నగర్), షేక్ రియాజ్ (బాల్కొండ), పుల్లఈ నవీన్ (బాల్కొండ), సెక్రటరీలుగా పద్మారావు (బాల్కొండ), పి. హనుమంత్ (కిసాన్ నగర్), డి .పవన్ (చిట్టాపూర్), రమేష్ ఆరుట్ల (కిసాన్ నగర్), సాయన్న (బాల్కొండ), పెద్ది.విలాస్ (శ్రీరాంపూర్) లు ఎన్నికయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామ శాఖ కమిటీ అధ్యక్షులుగా (జలాల్ పూర్) కత్తి రంజిత్ కుమార్, (నాగపూర్) ఎంబరి నరేష్, (కిసాన్ నగర్) కనికారపు గంగాధర్, (బాల్కొండ) కుందారపు శ్రీనివాస్, (ఇత్వార్ పేట్) పాత్కాల లింబాద్రి, (బస్సాపూర్) గాజుల భాస్కర్, (చిట్టాపూర్) గోజూరు గంగాధర్, (శ్రీరాంపూర్) దస రాకేష్, (వన్నెల్ బి) నాగులపల్లి దేవేందర్, (బోదేపల్లి) మోర్తాడ్ రాజ్ కుమార్ లు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షులు సట్ల గంగా ప్రవీణ్ (సర్పంచ్, చిట్టాపూర్) మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా నూతన కార్యవర్గం పని చేయాలి అని సూచించారు.నూతనంగా నియమితులైన మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -