Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో సెక్రటేరియట్ ను విజయవంతం చేయండి 

చలో సెక్రటేరియట్ ను విజయవంతం చేయండి 

- Advertisement -

మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశోదా భాస్కర్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మాలలకు విద్యా ఉద్యోగ అవకాశాలు జరుగుతున్న అన్యాయంపై రోస్టర్ ను సవరించాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటరీయాట్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్, మాల మహానాడు అద్దంకి యువసేన మండల అధ్యక్షుడు సంజయ్, మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ అన్నారు. శనివారం అంబేద్కర్ సెంటర్లో వారు మాట్లాడుతూ.. ఆగస్టు 31న బిఆర్ అంబేద్కర్ సచివాలయం హైదరాబాదులో నుంచి హలో మాల చలో సెక్రెటరీ యాట్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.

30 ఏళ్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట దళితుల ఐక్యతతో పాటు అనేక చట్టాల రూపకల్పనకు మార్గనివేషకమైందని అన్నారు కానీ బిజెపి పాలన వచ్చాక దళితులకు ఉన్న రక్షణ చట్టాలను ఒక్కొక్కటిగా సవరిస్తూ దళితుల అనైక్యతకు నిజమైన వర్గీకరణ తెరమీదకు తీసుకువచ్చి, న్యాయస్థానాల ద్వారా వారికి అనుకూలమైన ఇడుపుల ధర్మాసముతో ఆగస్టు ఒకటి 2024న ఎస్సీ వర్గీకరణ వెసులుబాటు రాష్ట్రాలకు అక్కు కల్పిస్తూ ఒక చీకటి తీర్పును ఇవ్వడమేందని అన్నారు. ఇప్పటికైనా మాలలకు ప్రభుత్వం స్పందించి అన్నిట్లో స్థానం కల్పించాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ వెంకన్న రవితో పాటు కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -