– జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ‘దామెర’ నియామకం
నవతెలంగాణ – సత్తుపల్లి
జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా సత్తుపల్లి పట్టణానికి చెందిన దామెర రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ నుంచి రమేష్ ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రమేష్ మాట్లాడుతూ… 1985 నుంచి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా సేవలు అందిస్తున్న నాకు, నేడు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్‌కు రమేష్ ధన్యవాదాలు తెలిపారు. 1985లో సత్తుపల్లిలో ఎన్ఎస్యూఐ స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, 1992లో ఖమ్మం జిల్లాలోనే రెండవ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేకమంది నాయకుల గెలుపునకు, పార్టీ బలోపేతానికి కార్యకర్తగా నా శక్తివంచన లేకుండా సేవలు అందించానన్నారు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ విస్తరణకు మరింత పట్టుదలతో కృషి చేస్తానని దామెర రమేష్ స్పష్టం చేశారు.
పార్టీ నిబద్ధతకు తగిన గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



