– సకాలంలో స్పందించిన ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన షేక్ నూర్ అహ్మద్ అనే యువకుడు పొలం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తలకు బలమైన గాయమై చర్మం ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే సత్తుపల్లి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) గొల్లమందల కృష్ణ, పైలట్ పాలడుగు వేణు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ప్రమాద స్థలంలోనే ప్రాథమిక వైద్యం అందించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తూ వైద్య సహాయం అందించారు. అనంతరం బాధితుడిని సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించిన 108 సిబ్బందిని గంగారం గ్రామస్థులతో పాటు ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ అభినందించారు.
డ్రైనేజీలో పడి యువకుడికి తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



