సభ్యులకు కార్యదర్శుల లేఖలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు కార్యదర్శులు శాసనస భ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సభ్యులకు సమాచారం పంపారు. వర్షాకాల సీజన్ ఎన్ని రోజులు సమావేశాలు జరపాలనే విషయమై బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఎనిమిదో విడతకు సంబంధించి రెండో సమావేశాలు కావడం గమనార్హం. ఈ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోవడంతో సమావేశాలను కనీసం వారం రోజులపాటు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. జెన్ జీలను అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీచేసేలా అర్హతలను సవరించే బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మరోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. సర్కారుపై ప్రతిపక్షాలు విరివిగా విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో సమావేశాల ద్వారా గుణపాఠం చెప్పేందుకు అధికారపక్షం ఈ సమావేశాలను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇదిలావుండగా బీఆర్ఎస్ సైతం ఈ సమావేశాల్లో సర్కారును ఇరుకున పెట్టాలని భావిస్తున్నది. సమావేశాలు ప్రారంభం రోజున జరిగే బీఏసీలో ఎన్ని రోజులు అసెంబ్లీ, మండలి జరగనున్నాయనే విషయమై స్పష్టత రానుంది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, మండలి కార్యదర్శి డాక్టర్ నరసంహచారి సన్నాహాలు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా అసెంబ్లీ భవనానికి మరమ్మతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో తరహాల అసెంబ్లీలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నది. మరమ్మతులు వేగంగా పూర్తిచేసే పనిలో అధికారయంత్రాంగం ఉంది.
7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



