Sunday, August 30, 2026
E-PAPER
Homeఆటలుగ్రాండ్‌స్లామ్‌ సవాల్‌

గ్రాండ్‌స్లామ్‌ సవాల్‌

- Advertisement -

బరిలో అల్కరాస్‌, జకోవిచ్‌, సబలెంక, స్వైటెక్‌
నేటి నుంచి యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

ఏడాదిలో చివరి, ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ షురూ కానుంది. క్వాలిఫయర్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌తో ఇప్పటికే ఊపందుకున్న యుఎస్‌ ఓపెన్‌ నేటి నుంచి ప్రధాన టోర్నమెంట్‌తో అభిమానుల ముందుకు రానుంది. ఆగస్టు 30న రానున్న యుఎస్‌ ఓపెన్‌.. సెప్టెంబర్‌ 13న ఫైనల్స్‌తో ముగియనుంది.

న్యూయార్క్‌ (యుఎస్‌ఏ) : స్టార్‌ ఆటగాళ్లకు గాయాలు, ఆఖరు నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవటంతో ఇటీవల కళ తప్పిన ప్రపంచ టెన్నిస్‌కు.. యుఎస్‌ ఓపెన్‌తో మళ్లీ సరికొత్త శోభ సంతరించుకోనుంది. వరల్డ్‌ నం.1 జానిక్‌ సినర్‌ (ఇటలీ) గాయంతో టైటిల్‌ రేసు నుంచి నిష్ర్కమించినా, ఆల్‌టైమ్ రికార్డు టైటిల్‌ కోసం నొవాక్‌ జకోవిచ్ (సెర్బియా), టైటిల్‌ నిలుపుకునేందుకు కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఇప్పటికే న్యూయార్క్‌లో అడుగుపెట్టారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లోనూ ఈసారి పోటీ బహుముఖంగా ఉండనుంది. యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతాయి.

జకోవిచ్‌ కొడతాడా?
సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ కెరీర్‌ రికార్డు గ్రాండ్‌స్లామ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. యుఎస్‌ ఓపెన్‌లో అగ్రశ్రేణి ఆటగాడు జానిక్‌ సినర్‌ గాయంతో తప్పుకోవటం జకోవిచ్‌ అవకాశాలను మెరుగుపరిచింది. సినర్‌ లేకపోవటంతో డ్రాలో ఓ వైపు అవకాశాలు ఏర్పడ్డాయి. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఏడాది ఎక్కువ కాలం రాకెట్‌ పక్కనపెట్టిన కార్లోస్‌ అల్కరాస్‌.. న్యూయార్క్‌లో టైటిల్‌ నిలుపుకునేందుకు బరిలోకి దిగుతున్నాడు. ప్రాక్టీస్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్న అల్కరాస్‌ ఇక్కడ వరుస టైటిల్‌తో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), అమెరికా లోకల్‌ స్టార్‌ టియాఫో సైతం టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నారు.

సబలెంకకు ఎదురుందా?
మహిళల సింగిల్స్‌ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణి అరినా సబలెంక (బెలారస్‌). డిఫెడింగ్‌ చాంపియన్‌ సబలెంక మరోసారి ఇక్కడ టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్న సబలెంకకు గట్టి సవాల్‌ ఎదురు కావటం అనుమానమే!. ఎలెనా రిబకినా, ఇగా స్వైటెక్‌, కొకొ గాఫ్‌, జెస్సికా పెగులాలు సైతం టైటిల్‌పై గురిపెట్టారు.

భారీ ప్రైజ్‌మనీ
యుఎస్‌ ఓపెన్‌ విజేతలకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు రై. 52.48 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ రెండు విభాగాల్లో రన్నరప్‌కు రూ. 26.71 కోట్ల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -