Sunday, August 30, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

నేడు ‘తటిల్లతలు’ ఆవిష్కరణ
కె.ఆనందాచారి కవితా సంపుటి ‘తటిల్లతలు’ ఆవిష్కరణ రవీంద్రభారతి మినీహాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.
– తెలంగాణ సాహితి

‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’ ఆవిష్కరణ
డాక్టర్ వుడుత చంద్రశేఖర్ రచించిన ‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’ పుస్తకం సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌‌లో ఆవిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ దారం రఘురామన్, డాక్టర్ మేకా విజయమోహన్ రెడ్డి, వారాల ఆనంద్, గండ్ర లక్ష్మణరావు, మాడిశెట్టి గోపాల్, స్వామి పలువురు సాహితీవేత్తలు పాల్గొంటారు.
కే.ఎస్.అనంతాచార్య, కార్యదర్శి, సమైఖ్య సాహితీ, కరీంనగర్.

సెప్టెంబర్‌ 5న పుస్తకావిష్కరణ సభ
తాటికొండాల నరసింహారావు సాహిత్య వ్యాసాల సంపుటి ‘ఆవర్తనం’ ఆవిష్కరణ సభ 5 సెప్టెంబర్‌ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సభలో డా. కె.వి. రమణాచారి, నామోజు బాలాచారి, డా. ఏనుగు నరసింహారెడ్డి, డా. కొండపల్లి నీహారిణి, కె. ఆనందాచారి, సమ్మెట విజయ, వంశీకృష్ణ, నీలిమ వి.ఎస్‌.రావు పాల్గొంటారు.
నామోజు బాలాచారి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ.

సింగిల్‌ పేజీ కథలపోటీ
వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ 55వ వార్షికోత్సవం సందర్భంగా సాహితీకిరణం మాసపత్రిక సౌజన్యంతో రామరాజు వేంకట సుబ్బారావు` లక్ష్మీనరసమ్మ స్మారక అంతర్జాతీయస్థాయి సింగిల్‌ పేజీ కథలపోటీ నిర్వహిస్తున్నది. సామాజిక అంశాలను స్పృశించే కథలను సెప్టెంబర్‌ 30 లోపు ‘ఎడిటర్‌ సాహితీకిరణం, 11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌ -500102 చిరునామా’కు పంపాలి.

కవితలకు ఆహ్వనం
జెన్ జీ ఉద్యమ నేపథ్యంలో అనేక మంది రచయితలు యువతకు సాలిడారిటీగా (తెలుగు, ఆంగ్లంలో ) fb, ఇతర మాధ్యమాలలో రాసిన కవితలను సేకరించి, ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ తరపున ‘కవితా సంకలనం’ ప్రచురించాలని నిర్ణయించాం.. ఇప్పటికే రాసిన వారు/ రాయాలని భావిస్తున్న వారు కవితలను సెప్టెంబర్ 20లోగా 918801910908, 6300328040 నంబర్లకు పంపాలి. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో పుస్తక ఆవిష్కరణ వుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -