– రోజురోజుకూ ఇన్ ఫ్లో తగ్గుముఖం..
నవతెలంగాణ – జుక్కల్
కౌలాస్ నాళా ప్రాజెక్ట్ లోకి రోజురోజుకు ఇన్ ఫ్లో తగ్గుముఖం పడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతము ఆదివారం ఉదయం నాటికి 457.90 మీటర్ల వద్ద నీటి నిల్వ కొనసాగుతోంది. ఎగువ నుండి 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారి సుకుమార్ రెడ్డి తెలిపారు. కెపాసిటీ 1.237 టీఎంసీ ఉంది. ఫ్లడ్ గేట్ ద్వారా 285 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, మొత్తం అవుట్ ఫ్లో 385 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం 600 క్యూసెక్కులు, శనివారం 498 క్యూసెక్కులు, ఆదివారం ఉదయం నాటికి 500 క్యూసెక్కులు ఇన్ ఫ్లో నీరు ఎగువ నుండి వచ్చి చేరినా రోజురోజుకూ వరద ఉదృతి తగ్గుతోందని చెప్పారు. మరోవైపు వర్షాలు కూడా ఆశించినంత స్థాయిలో పడకపోవడం ప్రాజెక్టు ఇన్ ఫ్లోకు నీటి తాకిడి తగ్గడానికి మరో కారణమని చెప్పారు.
కౌలాస్ నాళా ప్రాజెక్ట్ లోకి స్వల్ప ఇన్ ఫ్లో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



