- Advertisement -
నవతెలంగాణ – తొగుట
మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన క్యాస ధనలక్ష్మి – శివకోటి దంపతుల కుమార్తె నందిని, క్యాస వెంకటలక్ష్మి – కృష్ణమూర్తి దంపతుల కుమారుడు మల్లికార్జున్ వివాహ వేడుకను ఆదివారం ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్ లో నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. నందిని – మల్లికార్జున్ దంపతులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



