Sunday, August 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కవాల్ టైగర్ జోన్ రద్దు చేయాలి

కవాల్ టైగర్ జోన్ రద్దు చేయాలి

- Advertisement -

అసెంబ్లీలో తీర్మానం చేసి కోర్ సెన్సిటివ్ జోన్ ఎత్తివేయాలి 
నవతెలంగాణ-జన్నారం

కవాల్ టైగర్ జోన్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కోర్ సెన్సిటివ్ జోన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీరాముల భూమాచారి చేపడుతున్న పోరాటానికి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఖాజా మహమ్మద్ మాట్లాడుతూ.. కోర్ సెన్సిటివ్ జోన్ పేరుతో జన్నారం రేంజ్‌లో సస్పెండ్ చేసిన అటవీ శాఖ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ కాలానికి సంబంధించిన పూర్తి జీతాలను చెల్లించాలని కోరారు.

మంచిర్యాల జిల్లా అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు శనిగరపు వెంకటేష్ మాట్లాడుతూ.. కవాల్ టైగర్ జోన్, కోర్ సెన్సిటివ్ జోన్ కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను తరలించేందుకు అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రజల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా నిబంధనలను సరళీకరించాలని అన్నారు. జన్నారం మీదుగా ఉట్నూర్ వరకు ఫోర్‌లైన్ ప్రధాన రహదారిని ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు కోరుట్ల శంకరయ్య, జిల్లా విద్యార్థి సంఘం AISA అధ్యక్షులు బొమ్మిడి అభినయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు రామ్ చరణ్, పార్టీ నాయకులు బొమ్మిడి శ్రీను, బొమ్మిడి రవి, సుల్వరాజు తదితరులు పాల్గొన్నారు. సామాజిక పోరాట సమితి నాయకులు శ్రీరాముల భూమాచారి మాట్లాడుతూ తన పోరాటానికి మద్దతు తెలిపిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కవాల్ టైగర్ జోన్, కోర్ సెన్సిటివ్ జోన్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -