Monday, August 31, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చికిత్స పొందుతూ ఆశావర్కర్‌ మృతి

చికిత్స పొందుతూ ఆశావర్కర్‌ మృతి

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆశార్కర్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని సెరపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ప్రాథమీక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సెరపెల్లి ఉపకేంద్రంలో ఆమె ఆశావర్కర్‌ గా విధులు నిర్వహించేవారని తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పారు. మండల కేంద్రంలో చికిత్స తీసుకున్నా..ఎలాంటి మార్పు లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అయినా ఫలితం లేదనీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారని ఆవేదనతో చెప్పారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామ, మండల పరిధిలోని ఆశావర్కర్లు, వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు కాంతాబాయి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాంతాబాయికి ఆరోగ్యం బాగాలేకపోయినా రోగులకు రోగులకు వైద్య సేవలు అందించేదని పలువురు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -