- Advertisement -
జయంతి ఉత్సవాల్లో మీరేవార్ సాయిలు
నవతెలంగాణ-మద్నూర్
అన్న బహు సాటే స్ఫూర్తితో నేటి యువత ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మీరేవార్ సాయిలు యువతను కోరారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో అన్నా బహు సాటే 106వ జయంతి ఉత్సవాలు సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో జెండాను ఆవిష్కరించి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్న బహు సాటే జాతి కోసం ఎంతో కృషి చేశారని, ఆయన చూపించిన మార్గంలో నేటి యువత ముందుకు వెళ్లాలని కోరారు, ఈ జయంతి కార్యక్రమంలో ఆకాష్ యాదవ్ బస్వంత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



