– ఫిబ్రవరి 11,12 తేదీల్లో ఖమ్మంలో విద్యావైజ్ఞానిక మహాసభలు : టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్, నాగిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్‌ను తప్పనిసరి చేస్తే ఉద్యమిస్తామని టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, పి నాగిరెడ్డి చెప్పారు. టెట్ లేకుండానే పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల 11, 12 తేదీల్లో ఖమ్మంలో రాష్ట్ర ద్వితీయ విద్యా, వైజ్ఞానిక మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద ్‌లోని సామ్రాట్ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్యఅతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క హాజరవుతారని చెప్పారు. కామన్ స్కూల్ విధానాన్ని తేవాలని కోరారు. విద్యారంగంలో అసమానతలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత పాలకులు ప్రయివేటు విద్యారంగాన్ని ప్రోత్సహించారని విమర్శించారు. కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 6,678 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయని చెప్పారు. సర్కారు బడులపై నమ్మకం లేనందు వల్లే ప్రయివేటు పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్నారని అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్షను స్వాగతిస్తున్నామనీ, విద్యామంత్రిని కేటాయించాలనీ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని సూచించా రు. విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న హామీని అమలు చేయాలని చెప్పారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను చేపట్టాలని అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌సీఈఆర్టీ, డైట్‌లలో డిప్యూటేషన్‌పై ఉన్న వారు ఉపాధ్యాయులపై పెత్తనం సాగిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు మూడు డీఏలను మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులు మార్చిలోగా చెల్లించాలని చెప్పారు . తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ కార్య నిర్వాహక కార్యదర్శి కె లక్ష్మినారాయణ మాట్లా డుతూ పాఠ శాలలు, కాలేజీలు, విశ్వవిద్యా లయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు నన్నెబో యిన తిరుపతి, డి శ్రీనివాస్, పి నారాయ ణమ్మ, పాతూరి మహేందర ్‌రెడ్డి, ముప్పాని క్రిష్ణారెడ్డి, ఎ భాస్కర్‌రెడ్డి, ఎస్ కనకయ్య, రావుల రమేష్, గుంటి ఎల్లయ్య, ఆత్రం భుజంగరావు పాల్గొన్నారు.