Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచేయూత పింఛన్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్‌ 15 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 9వ తేదీ నుంచి 5 కేటగిరిల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. నేటితో గడువు ముగియగా.. దరఖాస్తు చేయని వారు ఇంకా ఉండటంతో వారి అభ్యర్థన మేరకు గడువు పొడిగించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్‌ కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -