Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది మృతి చెందారు. ఈ పేలుడు ఘటనలో 18 మంది గాయపడినట్లు సమాచారం. పిప్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోరి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతులంతా ఆ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో నివసించేవారేనని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఒక్కదాన్నే ప్రమాదం నుంచి బయటపడ్డా
ప్రమాద సమయంలో పరిశ్రమలోనే ఉన్న ఓ బాలిక ప్రాణాలతో బయటపడింది. ‘అసలేం జరిగిందో తెలియదు. నేను ఒక్కదాన్నే ప్రమాదం నుంచి బయటపడ్డా. బయటకు వచ్చేటప్పుడు నాకు ఎవరూ కనిపించలేదు. మా అమ్మానాన్న, నా ఇద్దరు చిన్న తమ్ముళ్లు అక్కడే ఉన్నారు’ అంటూ బాలిక గుక్కపెట్టి కన్నీళ్లు పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -