Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌస్టికాహారం పంపిణీ చేసిన సర్పంచ్‌

పౌస్టికాహారం పంపిణీ చేసిన సర్పంచ్‌

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని బస్వాపూర్ అంగన్వాడీలో గర్భిణీలు, బాలింతలకు ఆ గ్రామ సర్పంచ్‌ సర్పంచ్ రమణ సురేష్ గొండ మంగళవారం పౌస్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. డెలివరీ తర్వాత మహిళలు రక్తం లేక బలహీన పడటం సాధారణమే అని, వారి ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌస్టికాహారం అందిస్తోందని చెప్పారు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు గ్రామంలో ఇటీవల నిర్మాణాలు పూర్తైన ఇంకుడు గుంతలను పరిశీలించి, వేగంగా పనులు పూర్తి చేశారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి కార్యవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్, గర్భిణీలు ,బాలింతలు , మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -