హీరో రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాత. ఈనెల 10న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. హీరో రామ్ పోతినేని ట్రైలర్ ని లాంచ్ చేశారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, ‘మాధవ్ టీజర్ చూపించాడు. చాలా ఇంటెన్సిటీ ఉంది. నిజానికి ఒక డెబ్యూ హీరో తొలి సినిమా చేస్తున్నప్పుడు పాటలు, ఫైట్లు అన్నీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఒక ప్రేమకథతో రావాలి అనుకుంటారు. కానీ అవన్నీ కాకుండా ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమాని తను ఎంపిక చేసుకోవడం పట్ల నేను తనని అభినందిస్తున్నాను. ఇక ట్రైలర్ చాలా అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్‌లో కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ కథలో ఉన్న ఇంటెన్సిటీ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే ప్రతి కథ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నిర్మాతలు కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశారు’ అని తెలిపారు.
‘మారెమ్మ’ ట్రైలర్ అద్భుతం
- Advertisement -
- Advertisement -



