Wednesday, September 2, 2026
E-PAPER
Homeఆటలువినేశ్‌, ధ్రువ్‌ ముందంజ

వినేశ్‌, ధ్రువ్‌ ముందంజ

- Advertisement -

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
: ప్రతిష్టాత్మక తెలంగాణ గొల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ మంగళవారం ఘనంగా ఆరంభమైంది. హైదరాబాద్‌ గోల్ప్‌ క్లబ్‌లో జరిగిన తొలి రోజు పోటీల్లో వినేశ్‌ శర్మ, ధ్రువ్‌ షియోరాన్‌లు సంయుక్తంగా ముందంజ లో కొనసాగుతున్నారు. తొలి రోజు అండర్‌ 60 షాట్స్‌తో 10 పాయింట్లు సాధించిన వినేశ్‌ శర్మ, ధ్రువ్‌ షియోరాన్‌లు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అమర్‌దీప్‌ మాలిక్‌ (9), కోయిచిరో ఇషికా (7), హానీ (6), తంగరాజ (6) టాప్‌-5లో కొనసాగుతున్నారు. గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ విజేతలకు రూ. 1 కోటి నగదు బహుమతి అందిస్తున్నట్టు పీజీటీఐ నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -