Wednesday, September 2, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్లో ఈస్ట్‌ జోన్‌

ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌

- Advertisement -

సెమీస్‌లో సెంట్రల్‌ జోన్‌పై గెలుపు
నవతెలంగాణ-బెంగళూరు : దులీప్‌ ట్రోఫీ ఫైనల్లోకి ఈస్ట్‌ జోన్‌ ప్రవేశించింది. బెంగళూరులోని సీఓఈలో జరిగిన సెమీఫైనల్లో సెంట్రల్‌ జోన్‌పై ఈస్ట్‌ జోన్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఈస్ట్‌ జోన్‌ ఛేదించింది. వైభవ్‌ సూర్యవంశీ (40, 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (39 నాటౌట్‌, 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఛేదనలో రాణించారు. అభిమన్యు ఈశ్వరన్‌ (24), విరాట్‌ సింగ్‌ 912), కుమార్‌ కుశాగ్ర (22), సుదీప్‌ కుమార్‌ (14) మంచి ఆరంభాలు సాధించినా ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. సెంట్రల్‌ జోన్‌ స్పిన్నర్‌ హర్ష్‌ దూబె (4/53) నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులే చేసినా.. బౌలర్ల మెరుపులతో పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.

సౌత్‌ జోన్‌ ముందంజ!
మరో సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌ విజయం దిశగా సాగుతోంది. తొలుత నార్త్‌ జోన్‌ 195 పరుగులకే ఆలౌట్‌ కాగా.. సౌత్‌ జోన్‌ 312 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో నార్త్‌ జోన్‌ 66 ఓవర్లలో 7 వికెట్లకు 256 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 139 పరుగుల ముందంజలో కొనసాగుతుంది. సనత్‌ సంగ్వాన్‌ (76), ఆయుశ్‌ బదోని (31)లు రాణించారు. నేడు ఆఖరు రోజు ఆటలో సౌత్‌ జోన్‌ ఆఖరు మూడు వికెట్లు పడగొట్టి.. ఊరించే లక్ష్యాన్ని ఊదేసేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -