జన్నారం – జన్నారం
మండల కేంద్రంలో పద్మశాలి పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం దృశ్య జన్నారం పట్టణానికి వచ్చి పోయే వారికి చల్లటి నీటితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పద్మశాలి సంఘ నాయకులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం ఎస్సై ఉదయ్ కుమార్ ను సంఘ నాయకులు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు సిహెచ్ గంగయ్య, పొనకల్ పట్టణ అధ్యక్షుడు శెట్టిపల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు కందుల రమేష్, గౌరవ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సంబారి అంజన్న ప్రధాన కార్యదర్శి అయ్యోరు శ్రీనివాస్, కోశాధికారి రాజమౌళి, ప్రచార కార్యదర్శి దుస రాము, బాలిన రాము. నడిమెట్ల నరేందర్, పోతు వేణు,m శ్రీనివాస్,n బుచ్చయ్య, g సత్యం,ch రంజిత్,h రమేష్,pలచ్చన్న, k బుచన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



